బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టెస్ట్ ఆరంభం కానుంది. అడిలైడ్‌లో జరిగే ఈ డే/నైట్ టెస్టులో టీమిండియా ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్. అదే ఊపులో రెండో టెస్టులో గెలవాలని చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై ఆడుతోన్న ఆస్ట్రేలియా.. పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. పింక్ బాల్ టెస్టులో మంచి రికార్డు ఉన్న ఆసీస్.. టీమిండియాను ఓడించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని చూస్తోంది.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే, జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ పడగొట్టగా.. భారత్ 295 రన్స్ తేడాతో గెలిచింది. ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్‌తో డే/నైట్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలుకాబోతోంది. అయితే ఆస్ట్రేలియాలో మ్యాచ్, అదీనూ పింక్ బాల్ టెస్ట్ కాబట్టి.. మ్యాచ్ టైమ్,…
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. క్లార్క్ తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొనగా.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాప్ స్కోరర్ ఎవరన్న ప్రశ్నకు విరాట్ పేరు చెప్పాడు. ‘పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా ఓడిపోయిన విషయం పక్కన పెడితే.. కోహ్లీ మొదటి గేమ్‌లో సెంచరీ చేయడం నన్ను చాలా భయపెడుతోంది. ఈ సిరీస్‌లో విరాట్ భారీగా పరుగులు చేస్తాడు.…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన భారత్.. అడిలైడ్ కోసం సిద్దమైంది. డే/నైట్ మ్యాచ్‌గా జరిగే ఈ పింక్ బాల్ టెస్టులో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. తొలి టెస్టుకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అందుబాటులోకి రావడంతో.. దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.…
AUS vs IND: ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఉన్న టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ముందంజలో ఉంది. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 295 పదవుల భారీ విజయాన్ని అందుకోగా తన తర్వాతి మ్యాచ్ ను అడిలైడ్ వేదికగా ఆడనుంది. డే అండ్ నైట్ టెస్ట్ లో భాగంగా పింక్ బాల్ తో మ్యాచ్ జరగనుంది. ఇకపోతే మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం తర్వాత జోరు మీదున్న టీమిండియాను…
డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గాయపడటం జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ గాయపడ్డాడు. నెట్స్‌లో మార్నస్ లబుషేన్ వేసిన త్రో పడుతుండగా అతని వేలికి గాయమైంది.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ ఆటగాడు ఆశిశ్ నెహ్రా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా ఐపీఎల్ వేలంలోకి వస్తే.. అద్భుతమే జరిగేదని, ప్రాంచైజీలకు రూ.520 కోట్ల పర్స్ ఉన్నా సరిపోదన్నాడు. అతడిని ఓడించడం ఎవరి వల్ల కాదని నెహ్రా చెప్పుకొచ్చాడు. 2013 నుంచి బుమ్రా ముంబై ఇండియన్స్ ప్రాంచైజీకి ఆడుతున్నాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ 11 ఏళ్లలో ముంబై ఒక్కసారి కూడా బుమ్రాను వేలంలోకి విడిచిపెట్టలేదు. అంటే అతడికి ఎంత…
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశపర్చిన విషయం తెలిసిందే. మూడు టెస్టుల్లో 93 పరుగులే చేసి విమర్శల పాలయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో విరాట్ ఫామ్‌లోకి వస్తాడని మాజీలు ధీమా వ్యక్తం చేశారు. అన్నట్టుగానే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు. కోహ్లీ శతకం బాధగానే ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. విరాట్ కూడా స్టేడియంలో అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఫామ్‌లోకి వచ్చిన విరాట్ పలు…
భారత జట్టుకు శుభవార్త. వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. ప్రస్తుతం అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో కలిశాడు. టీమిండియా ఆటగాళ్ల సన్నద్ధతను దగ్గరుండి చూసుకుంటున్నాడు. అదే సమయంలో రెండో టెస్టు తుది జట్టుపై ప్రణాళికలు మొదలు పెట్టాడు. యశస్వీ జైస్వాల్‌తో కలిసి ఎవరిని ఓపెనర్‌గా పంపాలని మల్లగుల్లాలు పడుతున్నాడు. అయితే ఈ విషయంలో ఇప్పటికే గంభీర్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెర్త్ టెస్టు ముగిసాక…
ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అద్భుత బౌలింగ్‌తో ప్రపంచ మేటి బ్యాటర్లను సైతం వణికిస్తున్నాడు. బుమ్రా అంటేనే బ్యాటర్స్ భయపడిపోతున్నారు. ప్రస్తుతం బుమ్రాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రపంచ అత్యుత్తమ పేసర్‌గా బుమ్రాను అందరూ కీర్తిస్తున్నారు. తామే గొప్ప అన్నట్లు మాట్లాడే.. ఆస్ట్రేలియన్లు కూడా బుమ్రాను పొగిడేస్తున్నారు. బుమ్రాను ఇప్పటికే చాలా సార్లు ఎదుర్కొన్నా అని, అయినా అతడి బౌలింగ్ శైలి అంతుచిక్కదు అని ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్…