బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నెమ్మదిగా ఆడడం తనకు ఇష్టం లేదని ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ అన్నాడు. రోహిత్ తన సోదరుడు అని.. అతను గొప్ప శక్తి, సంకల్పంతో ఆడాలని కోరుకుంటున్నా అని చెప్పాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. పెర్త్ టెస్ట్ ఆడని రోహిత్.. అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో విఫలమయ్యాడు. కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన హిట్‌మ్యాన్.. ఆరో…
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 గురించి సోషల్ మీడియాలో తన పేరు, ఫొటో దుర్వినియోగం కావడంపై టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించారు. కొందరు సోషల్ మీడియాలో తన ఫొటోను ఉపయోగించి.. నచ్చినట్టుగా వార్తలు రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చినవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో చూసే ప్రతిదాన్ని నమ్మొద్దని కుంబ్లే తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్…
ఆస్ట్రేలియాపై మంచి రికార్డు కలిగిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈసారి మాత్రం నిరాశ పర్చుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లు భారీ స్కోరు సాధించిన పిచ్‌పై సీనియర్ అయిన విరాట్.. తన బలహీనతతో ఔట్ కావడం అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన ఆఫ్‌సైడ్ బంతిని ఆడి మరీ వికెట్ కీపర్‌కు దొరికిపోయాడు. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇలా ఔట్ కావడం మూడోసారి. దీంతో కోహ్లీపై భారత…
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఈ టెస్టులో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వారు విఫలమయ్యారు. ఆకాశ్ దీప్ 29.5 ఓవర్లలో 95 రన్స్ మాత్రమే ఇచ్చి ఒకే ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతేకాదు పిచ్‌కు అవతల చాలా…
బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (33), కెప్టెన్ రోహిత్ శర్మ (0) క్రీజులో ఉన్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్ ఇంకా 394 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు పడగొట్టగా.. జోష్ హేజిల్‌వుడ్, ప్యాట్…
ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్టులో 8 వికెట్స్ పడగొట్టిన బుమ్రా.. రెండో టెస్టులో 4 వికెట్స్ తీశాడు. బ్రిస్బేన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. మిగతా బౌలర్లు విఫలమైన చోట ఆరు వికెట్స్ పడగొట్టిన బుమ్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన…
భారత జట్టుకు ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ కొరకరాని కొయ్యగా మారాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ కొంపముంచిన హెడ్.. బోర్డర్–గవాస్కర్ ట్రోఫీ 2024-25లోనూ విజయాలను దూరం చేస్తున్నాడు. అడిలైడ్ టెస్టులో సెంచరీ చేసిన అతడు బ్రిస్బేన్ టెస్టులో శతకం బాదాడు. వన్డే తరహాలో 160 బంతుల్లో 152 పరుగులు చేశాడు. టీమిండియాకు సింహస్వప్నంలా మారిన హెడ్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. బుమ్రా అద్భుత బౌలర్ అని, మూడో టెస్టు రెండో రోజు ఆటలో అతడి…
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2-24-25లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ 405/7 స్కోరుతో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించిన ఆసీస్.. మరో 40 పరుగులు జోడించి మూడు వికెట్స్ కోపోయింది. వికెట్ కీపర్ అలెక్స్ కేరీ (70) హాఫ్ సెంచరీ చేశాడు. రెండోరోజు ట్రావిస్ హెడ్ (152), స్టీవ్ స్మిత్ (101)లు సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో…
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు చేసింది. 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్‌లో జరుగుతోంది. రెండో రోజు తొలి సెషన్ టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తే.. రెండో సెషన్లో ఆస్ట్రేలియా రాణించింది. తొలి సెషన్లో టీమిండియా 29.4 ఓవర్లు బౌలింగ్ చేసి 76 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసింది. మూడు వికెట్లలో జస్ప్రీత్ బుమ్రాకు రెండు వికెట్లు లభించగా, నితీష్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. అయితే రెండో సెషన్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.