బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో మొదలైన రెండో టెస్టులో భారత్ కుదేలైంది. పేసర్ మిచెల్ స్టార్క్ దెబ్బకు స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. డే/నైట్ టెస్ట్ మొదటిరోజు తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 23 ఓవర్లలో 4 వికెట్స్ కోల్పోయి 82 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్ కాగా.. విరాట్ కోహ్లీ (7) పరుగులే చేసి అవుట్ అయ్యాడు.
గులాబీ టెస్టులో టాస్ నెగ్గిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ మొదటి బంతికే ఎల్బీగా అవుట్ అయ్యాడు. ఈ సమయంలో కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31) క్రీజ్‌లో పాతుకుపోయారు. ముందుగా గిల్ అటాక్ చేయగా.. ఆపై రాహుల్ ఆడాడు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్‌కు జీవనాధారం లభించినా.. భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు.
Also Read: OnePlus Community Sale 2024: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై 6వేల తగ్గింపు!
కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వేగంగా పరుగులు చేస్తున్న సమయంలో మిచెల్ స్టార్క్ మరోసారి బౌలింగ్‌కు వచ్చి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. ముందుగా కేఎల్‌ను ఔట్ చేసిన స్టార్క్.. తన తర్వాత ఓవర్‌లో విరాట్ కోహ్లీని వెనక్కి పంపాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాగా ఆడిన గిల్.. బోలాండ్ వేసిన బంతికి ఎల్బీగా అవుట్ అయ్యాడు. దీంతో 4 ఓవర్ల వ్యవధిలో భారత్ 3 వికెట్లను కోల్పోయింది. ఇక ఇప్పుడు ఆశలు అన్ని రిషబ్ పంత్, రోహిత్ శర్మల పైనే ఉంది.