అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజే క్రికెట్ ఆస్ట్రేలియాపై సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండుసార్లు లైట్లు ఆఫ్ అయ్యాయి. దీంతో.. భారత ఆటగాళ్లు, అంపైర్లు అసౌకర్యానికి గురయ్యారు. మ్యాచ్ మధ్యలో పవర్ కట్ కారణంగా రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది. టీమిండియా బౌలింగ్ చేసే సమయంలో 18వ ఓవర్‌లో మొదటి సారి పవర్ పోయింది. హర్షిత్ రానా బౌలింగ్ చేస్తుండగా.. ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌స్వీనీ స్ట్రయిక్‌లో ఉన్నాడు. కరెంట్ కట్ కావడంతో ఫ్లడ్ లైట్లు ఆఫ్ అయ్యాయి. దీంతో.. స్టేడియంలో ఒక్కసారిగా చీకటి రావడంతో అభిమానులు కేకలు వేయడం ప్రారంభించారు. కొంత సేపటికి మళ్లీ లైట్లు వెలగగా.. మ్యాచ్ చాలాసేపు ఆగిపోయింది.
Read Also: Ambati Rambabu: ఎన్ని సిట్‌లు ఏర్పాటు చేస్తారు?.. సెటైర్లు వేసిన అంబటి రాంబాబు
టీమిండియా బౌలర్ హర్షిత్ రానా బౌలింగ్ చేస్తుండగా.. బంతి వేయడానికి వెళ్లగానే మరోసారి లైట్లు ఆరిపోయాయి. ఇలా పవర్ కట్ అవ్వడం చూసి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ నవ్వుకోగా.. అయితే హర్షిత్ రానాకు మాత్రం కోపం వచ్చింది. దీంతో.. అతని బౌలింగ్ రిథమ్ తప్పాడు. మరోవైపు.. అభిమానులు వారి ఫోన్‌లను తీసి లైట్లు ఆన్ చేసారు. కొంత సేపటికి మళ్లీ లైట్లు వెలిగాయి. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో క్రికెట్ ఆస్ట్రేలియాపై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు.
The lights went out twice in quick succession at Adelaide Oval, but play has resumed. #AUSvIND pic.twitter.com/u6Jtd39Utc
— cricket.com.au (@cricketcomau) December 6, 2024
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో టీమిండియా కేవలం 180 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలింగ్‌లో మిచెల్ స్టార్క్ 6 వికెట్లు తీశాడు. ప్యాట్ కమిన్స్, బొలాండ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మొదటి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆస్ట్రేలియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 86/1 ఉంది.