Dengue Vaccine : భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో మైలురాయిగా నిలిచే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘డెంగిఆల్’ పేరుతో అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్‌ల నుంచి రక్షణ కలిగించే లైవ్-అటెన్యూయేటెడ్ టీకా కావడం విశేషం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)…
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
దేశంలో మరోసారి కరోనా భయం పుట్టుకొస్తోంది. కేసులు రోజు రోజుకూ స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎలాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తోందో అని భయపడుతున్నారు. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సమాచారం వెల్లడించింది. దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య…
HMPV Virus: ‘‘హ్యుమన్ మెటాన్యూమోవైరస్’’(HMPV), ఈ కొత్త వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే చైనాలో దీని వల్ల వేల సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతం ఈ వైరస్ కారణంగా చాలా ప్రభావితమైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే, మన దేశంలో కూడా మూడు కేసులు రావడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
HMPV Virus: చైనాలో ప్రారంభమైన కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. చైనాలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పొరుగుదేశాలు ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించాయి. ఇదిలా ఉంటే, తాజాగా ఇండియాలో HMPV వైరస్ కేసుల సంఖ్య 6కి చేరింది. ఈ ఒక్క రోజే ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కోల్‌కతాలో 5 నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. చెన్నైలో మరో ఇద్దరు పిల్లలకు కూడా ఈ…
HMPV Virus: ప్రపంచవ్యాప్తంగా కొత్త వైరస్ ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కలవరపెడుతోంది. కోవిడ్-19 వ్యాధికి 5 ఏళ్లు ఇటీవల పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా వైరస్ చేదు సమయాన్ని మరిచిపోతున్నారు. ఇంతలో HMPV వైరస్ రావడం ప్రజల్ని భయపెడుతోంది.
HMPV Virus: చైనాలో ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా మూడు కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ భయాల మధ్య టాప్ మెడికల్ బాడీ-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ‘‘సర్క్యులేషన్’’లో…
గుజరాత్ రాష్ట్రంలో రెండు నెలల చిన్నారికి వైరస్ సోకినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం పాపను అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హస్పటల్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
China Virus: అందరు భయపడుతున్నట్లే జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (HMPV) సోకింది అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధ్రువీకరించింది.
మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.