Corona virus: : 20 కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి.. వైరస్ మళ్ళీ బలపడిందా?
- భారత్‌తో సహా 20కి పైగా దేశాల్లో కరోనా కేసులు
- రోజు రోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య
- మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా?
- ప్రజల్లో ఉత్పన్నమవుతున్న ఇలాంటి ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంతో సహా 20 కి పైగా దేశాలలో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మళ్లీ ఈ వైరస్ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? గత రెండు-మూడు సంవత్సరాల కంటే ఈసారి కోవిడ్ మరింత ప్రమాదకరంగా మారిందా? వైరస్‌లో ఏదైనా ప్రమాదకరమైన మ్యుటేషన్ జరిగిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
READ MORE: IMD Warning: పలు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
ఈసారి కరోనా నమూనాను పరిశీలిస్తే.. JN.1, BA.2.86 కేసులు పెరుగుతున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ICMR నుంచి ఈ వేరియంట్లు మునుపటి వాటి కంటే ప్రమాదకరమైనవని నిర్ధారించలేదు. అయితే ఈ వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కానప్పుడు… కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అనే ప్రశ్న అందరి మదిలో ఉంది.
అయితే.. వైద్య నిపుణులు దీనికి సమాధానం ఇచ్చారు. “ప్రస్తుతం వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. తేమ, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. దీనివల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రజలకు దగ్గు, జలుబు, తేలికపాటి జ్వరం వంటి సమస్యలు బయటపడుతున్నాయి. ఫ్లూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించినప్పుడు.. సమీపంలో ఉన్న ఏదైనా ఇతర వైరస్ కూడా వ్యాపిస్తుంది. కోవిడ్ పూర్తిగా తగ్గుముఖం పడ్డలేదు. అక్కడక్కడా ఇంకా ఉండటం.. ఈ వేరియంట్లలో మార్పుల కారణంగా కేసులు పెరుగుతున్నాయి. ప్రజల్లో రోగనిరోధక శక్తి తగ్గడం కరోనా వ్యాప్తికి కారణం.” అని నిపుణులు చెబుతున్నారు.
కాగా.. మన దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అవసరమని పేర్కొన్నారు. ఎవరైనా క్యాన్సర్ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!