CM Chandrababu: మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- విశాఖ మెడ్ టెక్ జోన్‌కు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి
- మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందన్న సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో మొట్టమొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విశాఖ మెడ్ టెక్ జోన్ సీఈఓ జితేంద్ర శర్మ, జోన్ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీపీసీఆర్ కిట్‌ను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కిట్‌ను తక్కువ ధరతో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడ్ టెక్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెడ్ టెక్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎర్బామ్‌డెక్స్ మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ (ErbaMDx MonkeyPox RT-PCR Kit) పేరిట ఈ కిట్ రూపకల్పన చేసినట్లు సీఈఓ జితేంద్ర శర్మ సీఎంకు వివరించారు.
Read Also: Kadambari Jethwani Issue: ముంబై నటి వ్యవహారంపై విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి నియామకం
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ కిట్ తయారీకి ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ అర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని తెలిపారు. మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా మొదటి ఆర్టీపీసీఆర్ కిట్‌ను రూపొందించిన మెడ్ టెక్ జోన్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం నుంచి మెడ్ టెక్ జోన్‌కు అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. వినియోగదారులకు ఆర్థిక భారం లేకుండా త్వరలో సోలార్‌తో నడిచే ఎలక్ట్రానికి వీల్ చైర్‌ను రూపొందించనున్నట్లు మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మన్నిక గల వైద్య పరికరాలను తయారు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
Proud to launch India’s first indigenous Monkeypox RT-PCR Kit at AP Medtech Zone, Visakhapatnam. Developed at AMTZ with Transasia Diagnostics, this kit is validated by ICMR and CDSCO. The lyophilized components in the kit are designed to be suitable for shipping and use even in… pic.twitter.com/wJ2W56HaaX
— N Chandrababu Naidu (@ncbn) August 29, 2024
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..