Healthy Habits ICMR: మనిషి వయసు ఎంతైనా సరే.. శరీరానికి ప్రతిరోజు తగినంత శారీరక శ్రమ కల్పించకపోతే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. పని చేయడం., చదువుకోవడం లేక వేరే ఏదైనా పనిచేస్తున్న ఎంతో బిజీగా ఉన్న గాని కొద్ది సమయం మాత్రం శారీరిక శ్రమకు సమయం కేటాయించాల్సిందే. తాజాగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శరీరాన్ని ప్రతిరోజు కాస్త అటు ఇటు కదల్చాలని సూచిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా జాతీయ పోషకాహార సంస్థ…
అధిక ఉప్పు మన ఆరోగ్యానికి హానికరం. అందుకే ఉప్పును పరిమిత పరిమాణంలో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదనపు ఉప్పు వల్ల కలిగే హాని గురించి డబ్ల్యూహెచ్‌వో స్వయంగా హెచ్చరిక జారీ చేసింది.
Vegetable oils: వంట కోసం ఉపయోగించే వెజిటెబుల్ ఆయిల్స్‌ని పదేపదే వేడి చేయడం వల్ల ఆరోగ్యం తీవ్ర ప్రభావం ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) వెల్లడించింది.
ICMR: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) బుధవారం దేశంలోని ప్రజల కొసం ఆహార మార్గదర్శాలకు విడుదల చేసింది. దేశంలో అవసరమైన పోషకాల అవసరాలను తీర్చడానికి, అసంక్రమిత వ్యాధుల్ని నివారించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి.
యాంటీబయాటిక్స్‌ని అనవసరంగా వాడకుండా ఉండేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక చర్యలు చేపట్టింది. మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటు, మంత్రిత్వ శాఖలోని విభాగాలు వారి స్థాయిలో అవగాహన ప్రచారాలను కూడా నిర్వహిస్తున్నాయి.
Covid Vaccination: కోవిడ్-19 వ్యాక్సినేషన్ తర్వాత యువకుల్లో అనూహ్యంగా ఆకస్మిక మరణాలు పెరగడం ప్రజల్ని ఆందోళనపరిచింది. అయితే ఇలా హఠాత్తుగా ఎలాంటి అనారోగ్యం లేని యువకులు గుండెపోటులో మరణించిన కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అయితే కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల భారతదేశ యువకుల్లో మరణాలు సంభవించే ప్రమాదాన్ని పెంచలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో తేలిన వివరాలను ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కి తెలియజేసింది.
Covid-19 Vaccination: ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగాయి. విషాదం ఏంటంటే యువత, ముఖ్యంగా 30 ఏళ్ల లోపు ఉన్నవారు కూడా గుండెపోటు వల్ల మరణించడం ఆందోళనల్ని పెంచుతోంది. అయితే కోవిడ్-19 తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువగా రికార్డ్ కావడంతో, కోవిడ్ వ్యాక్సినేషన్ వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయనే అపోహ ఉంది.
మగవారి కోసం కొత్త రకం గర్భనిరోధక ఇంజెక్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఇంజెక్షన్ సహాయంతో 99 శాతం గర్భాన్ని నివారించవచ్చని చెబుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఏడేళ్ల ఇంటెన్సివ్ రీసెర్చ్ తర్వాత ఈ ఇంజెక్షన్‌ను ఆమోదించారు. ఈ ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభమని.. దీని సక్సెస్ రేట్ చాలా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది.
Nipah Virus: నిపా వైరస్ మరోసారి కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మరణించారు. వీరితో సంబంధం ఉన్న వారి ఆరోగ్యాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కొత్తగా వచ్చిన నిపా వైరస్ వేరియంట్ తక్కువ వ్యాప్తి ఉన్నప్పటికీ, మరణాల రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి ప్రకటించారు.