మాజీ ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమెపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. తాత్కాలికంగా ఆమె సర్వీస్‌ను నిలిపివేయడంతో పటు భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షల్లో పాల్గొనకుండా నిషేధించింది. తాజాగా కేంద్రం కూడా ఆమెపై యాక్షన్ తీసుకుంది. ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది.
పుణెలో ట్రైనీ ఐఏఎస్‌గా ఉన్న పూజా ఖేద్కర్‌కు కష్టాలు మరింత పెరిగాయి. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటీసు జారీ చేసింది.
ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కీలక అధికారుల మార్పులు జరుగుతున్నాయి. తాజాగా, టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామలల రావు నియమితులయ్యారు. ఇంతవరకు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయనకు ఇప్పుడు ఈ బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఇదివరకు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది మరికొన్ని విషయాలు కోసం డిస్క్రిప్షన్ లో వీడియో చుడండి.
యూపీఎస్సీ (UPSC) పరీక్ష ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన పరీక్షల జాబితాలో చేర్చబడింది. భారతదేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో ఇది అగ్రస్థానంలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బి.హెచ్.సహదేవ్‌రావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ…
ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు అయ్యారు. మొత్తంగా 21 మంది ఐఏఎస్లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్లు బదిలీలు అయ్యారు. బదిలీల్లో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామకం అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పోలవరం…