రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్, హైదరాబాద్ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బి.హెచ్.సహదేవ్‌రావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పర్సా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్‌గా ఎ.వెంకట్‌రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సీహెచ్ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా డి.వేణుగోపాల్ బదిలీ అయ్యారు.