బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రాజా సింగ్... ఈ మధ్య పార్టీ విషయంలో అంతకు మించి అన్నట్టు ఉంటున్నారట. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజా.. కొందరు రాష్ట్ర పార్టీ నాయకుల మీదే డైరెక్ట్ అటాక్ చేస్తూ... అయామ్ ఫైర్.. అయామ్ ది ఫైర్ అంటున్నారట. నన్ను పార్టీ నుంచి పంపించే కుట్ర చేస్తున్నారు, ఏం.. ఉండనీయదల్చుకోలేదా అంటూ పబ్లిక్గానే ప్రశ్నిస్తున్నారాయన.
Hydraa: హైదరాబాద్ నగరంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలోని కిస్మత్ పురలో రెండు కాలనీలను కలిపే రహదారికపై అడ్డంగా నిర్మించిన ప్రహారీ గోడను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. దీంతో పాటు సాయంత్రానికి అక్కడ సిమ్మెంట్ రోడ్డును వేశారు బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు.
Minister Seethakka: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుపై టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. అపరిచితుడు సినిమాలో మాదిరిగా టీఆర్ఎస్ తన వైఖరి మారుస్తూ వస్తోంది.. ఉదయం రాము.. రాత్రి రేమోగా మారినట్లుగా వారి వ్యవహార శైలి ఉందన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నామని తెలిపారు. 15 నెలలు పూర్తి చేసుకున్నాం.. మొదటి ఏడాదిలో 57 వేల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించాం.. 20 వేల కోట్ల రుణాలు మాఫీ చేశాం.. 150 కోట్ల ట్రిప్పులు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు.
Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం విజయవంతంగా నడుస్తుంది. మంగళవారం (18)వ తేదీన రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా బేగంపేటలో 2వ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక Arora Banquets, ఫస్ట్ ఫ్లోర్, లైఫ్ స్టైల్ బిల్డింగ్, బేగంపేటలో సెలబ్రేషన్స్ చేయనున్నారు.
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.
Harish Rao: పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
ఆదర్శదంపతులుగా నిండు నూరేళ్లు కలకాలం జీవించాల్సిన వారు అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నారు. పరాయి వాళ్ల మోజులో పడి ప్రాణాలు కూడా తీస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అంబర్ పేటలో ఓ భర్త తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి…
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి…