ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు.. ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శించారు.
గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై మైనర్ బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. అయితే అత్యాచారానికి పాల్పడిన వీడియోను మరో మైనర్ బాలుడు రికార్డు చేశాడు.
ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఇంతలో ప్రియురాలు ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరించాయి. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉన్నారు.
హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య పూజలు చేశారు. వారితో పాటు పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకట రమణ రెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా.. దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
Holi 2025 : హోలీ అంటేనే రంగురంగుల పండుగ ..ఈ పండుగ అంటానే మజా ఉంటుంది ..ఆ మజా వెనకాల కిక్కు ఒకటి ఉంటుంది ..మన భాషలో చెప్పాలంటే గంజాయి. గంజాయిని నేరుగా తీసుకుంటే అది నేరమవుతుంది.. అయితే హోలీ సమయంలో కిక్ వచ్చే రూపంలో తీసుకుంటే అది తిను పదార్థం అవుతుంది.. పాత బస్తీలో బేగంబజార్ దూలిపేట కార్వాన్ లాంటి ప్రాంతాల్లో కిక్కు వచ్చే గంజాయిని వివిధ రకాలుగా తయారుచేసి అమ్ముతుంటారు.. దానిమీద ఎప్పుడు అధికారులు…
Human Trafficking : మన ఇంటి పక్కనే ఉంటున్న యువతులు ఏం చేస్తారో మనకు తెలియదు.. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు.. కానీ మనతో మాట మంతి కలుపుతారు.. అంతా బాగానే ఉంటుంది.. ఆఫీస్ టైం లో బయటికి వెళ్తారు.. తిరిగి ఇంటికి వస్తారు ..వాళ్ళు చేసే వ్యవహారం ఏంటో తెలియదు చాలామందికి.. ఇటీవల కాలంలో కాస్మోపాలిటన్ సిటీగా మారిపోయిన తర్వాత ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం చాలా తక్కువ అయిపోయింది.. ఇదే అక్రమార్కులకు ప్రధాన…