Anchor Shyamal: బెట్టింగ్ యాప్స్ కేసులో యాంకర్ శ్యామలపై కేసు నమోదు అయింది. దీంతో ఈ రోజు(మార్చ్ 24) పంజాగుట్ట పీఎస్ లో పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయింది. అయితే, ఇప్పటికే శ్యామలకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11మంది పైనా కేసు నమోదు అయింది.
Read Also: Ranya Rao: రన్యారావు కేసులో విస్తుగొల్పే విషయాలు.. అసలేం జరిగిందంటే..!
అయితే, యాంకర్ శ్యామలతో పాటు ఈ రోజు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా విచారణకు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఇక, హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్ లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తుంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. అలాగే, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో నటుడు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీతో పాటు పలువురు నటీమణులు సైతం ఉన్నారు. కాగా, ఇప్పటికే ఆదివారం నాడు టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పంజాగుట్ట పోలీసులు విచారణ చేశారు.