వీకెండ్ లో లేదా ఫెస్టివల్స్ సందర్భాల్లో ఫ్రెండ్స్ తో కలిసి.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హోటల్స్ లో డిన్నర్ చేసేందుకు వెళ్తుంటారు. ఇలా మీరు కూడా వెళ్తున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని చేజేతులా చిక్కుల్లో పడేసుకున్నట్లే. ఇటీవల పలువురు కస్టమర్లు తాము ఆర్డర్ పెట్టుకున్న ఆహారపదార్థాలు పాడైపోవడం, బొద్దింకలు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు మండి రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దారుణాలు వెలుగుచూశాయి.
Also Read:Nitish Kumar Reddy Marriage: బ్రో లవ్ మ్యారేజా.. నితీశ్ రెడ్డి సమాధానం ఇదే (వీడియో)!
బంజారాహిల్స్ లోని అరేబియన్ మండి 36, ఖైరతాబాద్ లోని మండి టౌన్, మండి కింగ్ రాయల్ రెస్టారెంట్లు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు తేల్చారు. కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్ లో ఎలుకలు, బొద్ధింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. పాడైన చికెన్ వాడుతున్నట్లు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు హోటల్ నిర్వాహకులు.
Also Read:Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్!
తుప్పు పట్టిన ఫ్రిడ్జ్ లో నాన్ వెజ్ స్టోర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఆయా హోటల్స్ పై చర్యలు చేపట్టారు. మరోవైపు ఫుడ్ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తమ ఆరోగ్యాలు ప్రమాదంలో పడుతున్నాయని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.