Hyderabad: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్ ల కోసం టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం
- ఐపీఎల్ మ్యాచ్ ల కోసం టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం
- ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం
- ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆపరేట్ చేయనున్నట్టు వెల్లడించారు
- గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ జోష్ మరింత కిక్కిచ్చేలా క్రికెట్ లవర్స్ కోసం టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాదులో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ప్రేక్షకుల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తుంది.. ఐపీఎల్ కు వచ్చే ఫ్యాన్స్ కి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు ఆపరేట్ చేయనున్నట్టు వెల్లడించారు గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసి అధికారులు. గ్రేటర్ పరిధిలోని 24 డిపోల నుంచి 60 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపారు.
Also Read:Aamir Khan : షారుఖ్, సల్మాన్ నా కెరీర్ ను తొక్కేస్తారనుకున్నా : అమీర్ ఖాన్
Also Read
ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్న తేదీల్లో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.. మార్చ్ 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే 10, మే 20, 21 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ లకి ప్రత్యేక ఆర్టీసీ సర్వీసులను అరెంజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు.. ప్రధానంగా ఘట్కేసర్, హయత్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ఎల్బీనగర్, కోటి, లక్డీకపూల్, దిల్ షుఖ్ నగర్, మేడ్చల్, కెపిహెచ్బి, మియాపూర్, జేబీఎస్, ఈసీఐఎల్, బోయిన్పల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహదీపట్నం, బీహెచ్ఈఎల్, వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం కు స్పెషల్ బస్సులు నడవనున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!