నాటక రంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ నటనా శిక్షణ సంస్థ “నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా” హైదరాబాద్‌లో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవాన్ని నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో కోల్కతా, భోపాల్, కేరళ ప్రాంతాల నుంచే కాకుండా.. నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొననున్నాయి. రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకూ ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో.. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికను అందించేందుకు నిర్వాహకులు సంసిద్ధమయ్యారు.
Read Also: Tamim Iqbal: ఆసుపత్రి నుంచి తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్..
కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ప్రదర్శితం కానున్నాయి. నాటక ప్రదర్శన కళలను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా ఈ ఈవెంట్ ను మరింత విజయవంతం చేసేందుకు తనవంతు కృషి చేస్తోంది. ‘స్వీయ వ్యక్తీకరణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, కళలపై పట్టు సాధించడానికి నాటక రంగం ఓ శక్తివంతమైన సాధనం. విభిన్న సంస్కృతుల నుంచి యువ కళాకారులను ఓ చోట చేర్చడం ద్వారా కొత్తతరం నాటక ప్రేమికులను ప్రోత్సహించాలని భావిస్తున్నాం.’ అని నిర్వాహక బృందం ప్రతినిధి దేవికాదాస్ పేర్కొన్నారు.
Read Also: Wife Poisons Husband: భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య.. వేరే వ్యక్తితో మాట్లాడొద్దనడమే పాపమా..?
అంతర్జాతీయ స్థాయిలో రంగస్థలంపై చిన్నారులు చేసే మ్యాజికల్ పర్ఫామెన్స్ వీక్షించడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఈ ఈవెంట్ అందిస్తోంది. కళ్లు చెదిరే నాటక ప్రదర్శనలు, అలరించే కార్యక్రమాల సమ్మేళనంతో మొదటి అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం.. ఓ ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమంగా నిలువబోతోంది.