BRS MLCs Protest: శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేసింది. హామీల అమలు కోసం వినూత్న తరహాలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తుంది. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా కారు పార్టీ ఎమ్మెల్సీల నిరసన చేశారు. తక్షణమే తులం బంగారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు తెలిపారు. ఇప్పటి వరకు పెళ్లైన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తులం బంగారం కోసం ఆడ పిల్లల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పేర్కొన్నారు.
Read Also: Kodali Nani: కొడాలి నానికి అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చేరిక..
ఇక, శాసన మండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదన చారి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చారు.. కేసీఆర్ ప్రభుత్వం ఆడ పిల్లలకు కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయల స్కీం ప్రవేశ పెట్టారు.. అనేక వర్గాల ప్రజలను ఆదుకున్నారు కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకానికి తీవ్ర మనస్తాపానికి గురి చేసింది.. తులం బంగారం ఇవ్వలేదు, నెలకు 2500 ఇవ్వలేదు.. కాంగ్రెస్ పార్టీ మహిళా లోకాన్ని మోసం చేసింది.. సెంటిమెంట్ ఉపయోగించి నమ్మించి మోసం చేశారు.. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడుస్తుంది అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తక్షణమే పెళ్లైన అమ్మాయిలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి మహిళా లోకం బుద్ధి చెబుతారు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూడాలి అని కోరారు.