Drunken Drive : హైదరాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుండి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు ట్యాంకర్ డ్రైవర్ యాదగిరిపై బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 325 బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) పాయింట్స్…
Sana Don : తల్లి డైరెక్షన్ తో పిల్లలు ముందుకు వెళ్తారు. అయితే తల్లి డైరెక్షన్ మంచిది అయితే ఇక్కడ స్టోరీ చెప్పుకోవాల్సిన పనిలేదు.. ఆ తల్లి ఏకంగా ఒక డాన్.. పిల్లల్ని మంచి దిశగా తీసుకుని అవసరం ఉంది.. కానీ తన పిల్లల్ని కూడా తన దారిలోకి తీసుకొని వచ్చింది.. తల్లి దొంగతనాల కోసం స్కెచ్ వేస్తోంది.. ఆ తర్వాత పిల్లలు వెళ్లి దోచుకుని వస్తారు.. ముగ్గురు పిల్లలు తల్లి కలిసి హైదరాబాదులోని అత్యంత ధనవంతుడు…
తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు.. సహాయం చేసిన చేతులనే నరికి వేస్తున్న సంఘటనలు.. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చినందుకు చంపి పాతర వేశాడు.. తన పాడు బుద్ధులను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు సహాయం చేసిన అడ్వకేట్ ని వేటాడి చంపేసిన తీరు ఇది. హైదరాబాదులోని చంపాపేట్‌లో జరిగిన దారుణ సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. పాతబస్తీ చంపాపేట్‌కు చెందిన ఎర్రబాబు ఇజ్రాయిల్.. ఇతను ఒక న్యాయవాది.. హైకోర్టుతో పాటు సిటీలోని…
వీకెండ్ లో లేదా ఫెస్టివల్స్ సందర్భాల్లో ఫ్రెండ్స్ తో కలిసి.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి హోటల్స్ లో డిన్నర్ చేసేందుకు వెళ్తుంటారు. ఇలా మీరు కూడా వెళ్తున్నారా? అయితే మీ ఆరోగ్యాన్ని చేజేతులా చిక్కుల్లో పడేసుకున్నట్లే. ఇటీవల పలువురు కస్టమర్లు తాము ఆర్డర్ పెట్టుకున్న ఆహారపదార్థాలు పాడైపోవడం, బొద్దింకలు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు మండి రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ…
Heavy Rain: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం పడుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురుస్తోంది. కాగా, హైదరాబాద్ పరిధిలో బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాలలో కురుస్తుంది వర్షం.
Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు.
Anchor Shyamala: ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన యాంకర్ శ్యామల.. రెండున్నర గంటలకు పైగా శ్యామలను పోలీసులు విచారణ చేశారు. ఇక, విచారణ అనంతరం శ్యామల మాట్లాడుతూ.. విచారణ సమయంలో మాట్లాడటం సమంజసం కాదు అని పేర్కొన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నాను.. బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోయిన వారిని ఎవరు భర్తీ చేయలేరు.. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్‌లకు పాల్పడటం తప్పు అని ఆమె తెలిపారు. Read Also: Local Body…
Local Body MLC Election: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది.
Lawyer Murder Case: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు.
ASHA Workers Protest: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.