ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది లేడీ అఘోరీ. కొద్ది రోజుల క్రితం ఓ లేడీ ప్రొడ్యూసర్ తనను పూజల పేరిట లక్షల రూపాయలు దండుకున్నదని లేడీ అఘోరిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో లేడీ అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇదిలా ఉంటే ఇటీవల లేడీ అఘోరీ, వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Also Read:Summer Tips: ఎండలు మండుతున్నాయ్ గురూ.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేదంటే?
సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. అంతేకాదు లేడీ అఘోరిపై వర్షిణి కుటుంబ సభ్యులు, సాదువులు, లేడీ అఘోరీ మొదటి భార్య కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో లేడీ అఘోరీ వర్షిణి సంచలన ప్రకటన చేశారు. మా జోలికి వస్తే మా ప్రాణాలు వదిలేస్తాం అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈవీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఇక సెలవు మేమిద్దరం.. చనిపోతున్నాం.. మా చావుకు రెండు తెలుగు రాష్ట్రాలే కారణం..
Also Read:Mukunda Jewellers : చందానగర్ లో ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ షోరూమ్ లాంచ్
మమ్మల్ని చాలా తప్పుగా ట్రోల్ చేస్తున్నారు..అందుకే మేము చనిపోవాలి అనుకుంటున్నాం.. మమ్మల్ని మర్చిపోండి.. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం.. మమ్మల్ని ఎవరూ వెతకొద్దు.. మమ్మల్ని టచ్ చేయొద్దు, ఇక మా ఇద్దరిని మర్చిపోండి మీకు ఎవరికీ కనిపించము.. ఇకపై తెలుగు రాష్ట్రాలకు రాము.. కేదార్నాథ్ వెళ్తున్నాము.. జీవితాంతం అక్కడే ఉంటాము.. మిమ్మల్ని విడదీయాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని లేడీ అఘోరీ, వర్షిణి జంట వెల్లడించారు.