KTR: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ కీలక ఆదేశాలు
- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరికీ ఓటు వేయొద్దని ఆదేశాలు..
- ఎవరైనా విప్ ధిక్కరించి ఓటింగ్ కు వెళ్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు జరిగినా మనమే గెలిచే వాళ్ళం.. మొన్న 2023లో కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని స్థానాలు మనమే గెలిచాం.. హైదరాబాద్ వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మనల్ని గెలిపించారు.. ఔటర్ అవతల ఉన్న వాళ్లు కాంగ్రెస్ మాటలకు మోసపోయారు అని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం చేస్తుంది.. హైడ్రాతో పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు అంటూనే.. మూసి సుందరీకరణ చేస్తాను అంటున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఇక, సందట్లో సడెమియా లాగా బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Drishyam 3 : పాన్ ఇండియా లెవల్‌లో దృశ్యం- 3..!
Also Read
ఇక, కేంద్రంలో ఒక సహాయ మంత్రి, మరో నిస్సహాయ మంత్రి ఉండి ఎలాంటి లాభం లేదు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటే.. అందరూ ఎంపీలు భుజాలు తడుముకుంటున్నారు.. బయటకు వచ్చి బీజేపీ ఎంపీలు నన్ను తిడుతున్నారు.. సోనియా, రాహుల్ గాంధీల మీద చార్జ్ షీట్ వేస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేశారు.. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడలేదు.. బీజేపీ, నరేంద్రమోడీతో చోట భాయ్- బడా భాయ్ బంధం ఉంది కాబట్టే రేవంత్ మాట్లాడడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
Read Also: Greater Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ఎవరూ ఓటుకు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటు వేయడానికి వెళ్లొద్దని సూచించారు. ఎవరైనా విప్ ధిక్కరించి ఓటింగ్ కు వెళితే వారిపై చర్యలు తీసుకుంటాం.. ఓటు ఉన్న వాళ్లకు విప్ ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డిలను కేటీఆర్ కోరారు.
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!