పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. తెలంగాణలో ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటర్ పలితాలు విడుదల చేస్తారని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. మరో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.. ఫలితాలను సీజీజీ ప్రాసెస్ చేసింది..
Also Read:Muthayya: ‘ముత్తయ్య’ నుంచి ‘సీనిమాల యాక్ట్ జేశి..’ సాంగ్ రిలీజ్
వాళ్ళకి వారం రోజుల టైమ్ కావాలని అడిగారు ఇచ్చాము.. రేపు 12 గంటల తర్వాత ఫలితాలు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.. సర్వర్ లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం.. 60 లక్షల జవాబు పత్రాలను కరెక్షన్ చేయడం జరిగింది.. పేపర్ కరెక్షన్ ప్రక్రియలో 18 వేల 500 మంది స్టాఫ్ పాల్గొన్నారు.. పారదర్శకత కోసం అన్ని evaluation సెంటర్ లలో సీసీ కెమెరాలు పెట్టాము.. ఆన్సర్ స్క్రిప్టులను రాండమ్ గా చెక్ చేసాము.. పరీక్ష ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు రాకుండా లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం..
Also Read:Madhubala: హీరోయిన్ మధుబాల లవ్ స్టోరీ.. అండర్‌వరల్డ్‌తో సంబంధం?
విద్యార్థులకు అనుమానాలు ఉంటే రీ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు అని తెలిపారు. ఇంటర్ ఫలితాలు నేరుగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లో అందుబాటులో ఉండనున్నాయి. ఎన్టీవీ విద్యార్థుల కోసం ఇంటర్ ఫలితాలను అందిస్తోంది.. కింద చూయించిన లింక్‌ను క్లిక్ చేసి.. మీ హాల్‌టికెట్ నంబర్ టైప్ చేస్తే చాలు.. ఇట్టే ఇంటర్ ఫస్టియర్‌తో పాటు.. ఇంటర్ సెకండియర్ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.