MLA Raja Singh: జనాలను రెచ్చగొట్టడానికే ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మీటింగ్ పెట్టారు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఈ రోజు మీటింగ్ లో నిజం చెప్పు అని అడిగారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వాస్తవాలను మీరు చెప్పలేరు.. వక్ఫ్ భూములు అమ్మించింది మీరే.. కబ్జా చేసింది మీరే అని పేర్కొన్నారు. తక్కువ రెంట్లకు తీసుకుంది మీరే.. అల్లాహ్ ఇచ్చిన ల్యాండ్ అమ్మ వద్దని ఎప్పుడు గుర్తుకు రాలేదా.. బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ ల్యాండ్ సేఫ్ గా ఉండాలని ఈ చట్టం తీసుకొచ్చిందని రాజా సింగ్ తెలిపారు.
Read Also: CM MK Stalin: మా తమిళనాడులో అమిత్ షా మార్క్ చాణక్యం నడవదు..
అయితే, వక్ఫ్ భూములు జాగ్రత్తగా ఉండాలని, తక్కువ రెంట్ కు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది అని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. వక్ఫ్ బిల్లుపై తప్పుగా మాట్లాడాలని ఒవైసీ అనుకుంటున్నారు.. రెచ్చ గొట్టడానికి ఒవైసీ మీటింగ్ పెట్టీ తప్పు చేస్తున్నారు అని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ బిల్లుపై వ్యతిరేకంగా ఆందోళన చేస్తే మీకే నష్టం జరుగుతుందని ముస్లింలకు తెలియజేశారు. దయచేసి ముస్లిం సోదరులు ఆలోచన చేయాలి.. మేలుకోవాలి అన్నారు. ఎంత చేసిన వక్ఫ్ చట్టం వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని బీజేపీ నేత రాజా సింగ్ వెల్లడించారు.