విద్యా సంస్థల సమీపాల్లో నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్స్ విక్రయిస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ బ్యూరో (TGANB), హైదరాబాద్ సిటీ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసింది. ఈ ముఠా చిన్నారులు, యువతపై లక్ష్యంగా ఈ ఉత్పత్తులను విక్రయిస్తోంది. సాదిక్ లలాని, అనిల్ లలాని అనే సోదరులు, నాంపల్లి ప్రాంతంలో నివసిస్తూ, “SID” అనే WhatsApp గ్రూప్ ద్వారా 500 మందికి పైగా సభ్యులకు ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో ప్రొమోట్ చేసి విక్రయించేవారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా కొత్త స్టాక్ వచ్చినప్పుడల్లా ప్రకటనలు పెట్టేవారు.
Also Read:Heart Attack: క్రికెట్ ఆడుతుండగా ఆగిన గుండె.. గ్రౌండ్‌లోనే మరో యువకుడు మృతి
వినియోగదారులు వారి కుటుంబ సభ్యుల ఖాతాలకు UPI, వాలెట్, బ్యాంక్ మార్గాల్లో డబ్బులు పంపించేవారు. ఈ ముఠాకు న్యూఢిల్లీలోని అమిత్, ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తులు సరఫరాదారులుగా పనిచేస్తున్నారు. భారీ మొత్తాల కోసం హవాలా మార్గాలు కూడా ఉపయోగించేవారు. ర్యాపిడో, ఉబర్, DTDC ద్వారా డెలివరీ చేసేవారు. చదువుతున్న 13 మంది మైనర్లు ఈ ముఠా ఖాతాదారులుగా గుర్తించబడ్డారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. అలాగే, 400 మందికి పైగా వినియోగదారులు ట్రాన్సాక్షన్ల ద్వారా గుర్తించబడ్డారు.
Also Read:Bhadradri Kothagudem: ఫారెస్ట్ అధికారుల అమానుష చర్య.. రైతు మోటారు బోరులో రాళ్ళు వేసిన వైనం
7 కార్టన్ బాక్సుల్లో 1217 పీస్‌లు స్వాధీనం చేసుకోగా, వీటి విలువ రూ. 25 లక్షలు. అదనంగా రూ.18,440, 225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. PECA-2019, COTPA-2003, జువెనైల్ జస్టిస్ యాక్ట్-2015 క్రింద కేసు నమోదు అయింది. డిటిడిసి, ఉబర్, ర్యాపిడోలపై కూడా నిర్లక్ష్యానికి సంబంధించి చర్యలు తీసుకోనున్నారు.