ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8వ తేదీన మళ్లీ తమ ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ రావు పోలీసుల విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా శ్రవణ్ రావు తప్పించుకుంటున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు కావాలని సిట్ కోరింది. రెండు సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగితే ఒకటే ఇచ్చి శ్రవణ్ రావు తప్పించుకున్నారు. Also…
Jagadish Reddy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోరాడుతున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం అన్నారు.
Jupally Krishna Rao: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్సీయూలో ఒక్క ఇంచు భూమి కూడా తీసుకోలేదు అని తేల్చి చెప్పారు.
Pastor Praveen: హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో పూర్తిస్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకు శ్రవణ్ రావు హాజరయ్యారు. ఈ రోజు (ఏప్రిల్ 2న) విచారణకు రావాలంటూ శ్రవణ్ రావుకు గత విచారణ సమయంలో సిట్ నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చే దిశలో మరో అడుగు పడింది. గ్లోబల్ టెక్నాలజీ సంస్థ ‘క్లియర్టెలిజెన్స్’ తన ఇండియా డెలివరీ అండ్ ఆపరేషన్స్ సెంటర్ను తాజాగా హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్లో ప్రారంభించింది. క్లియర్టెలిజెన్స్ సంస్థను తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఓవెన్ ఫ్రీవోల్డ్, మేనేజింగ్ పార్టనర్ అనీల్ భరద్వాజ్, హరికృష్ణ (డైరెక్టర్), ఎంఎం ఇన్ఫో టెక్నాలజీస్ ఫౌండర్ మురళి (నార్త్ కరోలినా), శ్రీధర్ సుస్వరం (జీఎం…
GHMC : 2024-25 ఆర్థిక సంవత్సరంలో, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలు అయ్యింది. ఈ ఏడాది 2,038 కోట్లు, 48 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం జరిగింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 121 కోట్లు ఎక్కువ. గత ఆర్థిక సంవత్సరంలో 1,917 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయబడింది. ఈ సంవత్సరంలో 19 లక్షల 50 వేల ఆస్తులున్నా, 14 లక్షల 8 వేల మంది…
Physical Harassment: హైదరాబాద్ నగరంలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్మన్ యువతిపై అత్యాచారయత్నం చేసిన అస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ వచ్చి, నగరాన్ని సందర్శిస్తున్న జర్మన్ యువతి, యువకుడు ఇద్దరూ స్నేహితుల వద్ద ఉండి అక్కడి ప్రదేశాలను చూస్తూ తిరుగుతున్నారు. అయితే.. నిన్న మార్కెట్ చూసేందుకు జర్మన్ యువతి, యువకుడు బయటకు వచ్చారు. మీర్పేట్ సమీపంలో జర్మన్ యువతి, యువకుడిని అస్లాం, అతడి స్నేహితులు చూశారు. నగరాన్ని…
Payal Shankar : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ భూ విక్రయ విధానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ముఖ్యంగా యూనివర్శిటీ భూముల అమ్మకంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిపాలన పరిస్థితులను చూస్తుంటే, కేసీఆర్ అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందని పాయల్ శంకర్ అన్నారు. నాడు ఎంపీగా ఉన్నప్పుడు ‘ప్రభుత్వ భూములు అమ్మకూడదు’ అని చెప్పిన రేవంత్ రెడ్డి, నేడు ఏ అధికారంతో భూములను…