Hydraa: హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తుంది. ఈ రోజు వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రోడ్డును ఆక్రమించిన స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ.. తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 213, 214, 215, 216లో రోడ్డుకు అడ్డంగా గోడ కడ్డడంతో పలు కాలనీలకు రాకపోకల బంద్ అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ఆయా కాలనీలకు చెందిన ప్రజలు హైడ్రాను ఆశ్రయించారు. కాలనీ వాసుల ఫిర్యాదుతో సర్వే చేసి వివరాలు సేకరించిన హైడ్రా అధికారులు.. శ్రీరంగపురం కాలనీ, సుందరయ్య కాలనీ, ఆపిల్ కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలతో పాటు సుమారు 7, 8 కాలనీలకు వెళ్లే రహదారి కబ్జాకు గురైనట్లు గుర్తించిన హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.
Read Also: Indian Students US: అమెరికాలో వీసాలు తిరస్కరించబడిన విద్యార్థులలో 50 శాతం మంది భారతీయులే..
మరోవైపు, మియాపూర్ పరిధిలో గల హఫీజ్ పేట్ లో సైతం హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ కూల్చి వేతలు చేపట్టారు. హఫీజ్ పేట్ సర్వే నెంబర్ 79లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతుంది. వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్ల ఏర్పాటు చేశారు. స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేస్తున్నారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగిస్తున్నారు.