హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. బలమైన ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తున్నాయి. నగరంలో ఈదురు గాలులు వణికించాయి. గాలుల ధాటికి అబిడ్స్ లో భవన నిర్మాణంపై నుంచి భారీ క్రేన్ కూలిపోయింది. పక్కన ఉన్న ఆరోగ్య హాస్పిటల్ భవనంపై కూలింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఈ ఘటన చోటుచేసుకుంది. హాస్పిటల్ 4వ అంతస్తుపై పడ్డ క్రేన్.. గతంలోనే భవనం కాలి చేసేసిన ఆరోగ్య హాస్పిటల్ మేనేజ్మెంట్.. 4వ అంతస్తు కాలీగా ఉండడం అందులో పేషెంట్ లు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.. క్రేన్ పడడంతో 4వ అంతస్తు పాక్షికంగా ధ్వంసమైంది.
Also Read:GVMC: ఉత్కంఠ రేపుతున్న వైజాగ్ మేయర్ అవిశ్వాసం.. మేజిక్ ఫిగర్ పై కొనసాగుతున్న ఊగిసలాట..
గోడలు & సైడ్ వాల్ పెచ్చులూడి కింద షెడ్ పై పడటంతో కైలాష్ డయాగ్నస్టిక్ సెంటర్ ఫర్నిచర్ ధ్వంసమైంది. నార్త్‌స్టార్ నిర్మాణానికి చెందిన భారీ క్రేన్ కూలడంతో క్రేన్ తొలగిస్తున్న టెక్నికల్ టీం.. భారీ క్రేన్ కూలిపోవడంతో హెవీ క్రేన్ లిఫ్టర్ సహాయంతో క్రేన్ తొలగింపు పనులు ముమ్మరం చేశారు అధికారులు.. నిన్న రాత్రి నుంచి క్రేన్ తొలగింపు పనులు జరుగుతున్నాయి. క్రేన్ కూలిన సమయంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.. పక్కన ఉన్న భవనాలు & వాహనాలపై క్రేన్ పడడంతో భవనంతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.