మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారట.. హైదరాబాద్లో ఉన్న కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు.. ఛాతిలో నొప్పిరావడంతో.. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిందితుడు మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ లో నిందితుడు ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో ఎక్కినట్లు అనుమానిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్ లో సీసీ కెమరాల్లో నిందితుడు కనిపించలేదు.
హైదరాబాద్ బంజారాహిల్స్లో బైక్ రేసర్ బీర్ బాటిల్తో కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
హైదరాబాద్లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు.
తెలంగాణలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిన్న ఓ న్యాయవాది అనుమానాస్పద రీతిలో మరణించిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయని, తమ రక్షణ కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ర్యాలీలు నిర్వహించారు.
హైదరాబాద్ నగరంలోని ఘాట్కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. మేడ్చెల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూయించారు. ఫొటోను చూసిన యువతి.. రైలులో తన పై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని గుర్తు పట్టింది. ఏడాది క్రితమే మాహేశ్ భార్య అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన మహేశ్ పాత నేరస్తుడు. ప్రస్తుతం పోలీసుల…
మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు.
చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ…
Alleti Maheshwar Reddy : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా భూముల కేటాయింపు, పింఛన్లు, పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి, హైడ్రా విధానం, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “వందల కోట్ల ముడుపులు తీసుకుని 25 లక్షల చొప్పున భూములను పరిశ్రమలకు అప్పనంగా కట్టబెట్టారు. దేవాలయ భూములను కూడా పరిశ్రమలకు కేటాయించడం ఎంతవరకు…