ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచిఉంటారు-కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాషా సాహిత్యాలు నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె చిరకాలం నిలిచివుంటారని స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య డా. సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన కేసీఆర్.. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేకశైలిలో తెలంగాణ పద సోయగాలను వొలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు గుర్తుచేవారు.. ప్రకృతీ మానవ తాత్వికతను ఆవాహనం చేసుకున్న ద్రష్ట, తెలంగాణ జాతికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన సాహితీ స్రష్ట… సినారె అని కొనియాడారు.. దక్కనీ ఉర్దూ తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీలను చేసి, గజల్స్ తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తహజీబ్ కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని పేర్కొన్నారు.. దేశీయ అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణ కు ఒక ప్రత్యేకస్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరం అన్నారు సీఎం కేసీఆర్.
Also Read
తాజావార్తలు
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
-
Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!