తెలంగాణలో ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది… మొదటగా జులై 1వ తేదీ నుంచి ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు ఈనెల 25వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్తున్నారు.. అయితే.. ఇవాళ మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆఫ్ లైన్ తరగతులు స్టార్ట్ చేయాలని అనుకున్న…. కరోన నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులే నిర్వహించాలని సీఎం కేసీఆర్ చెప్పారని.. కేజీ నుండి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు.. ఇక, డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని.. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు సబిత. మరోవైపు.. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దందాపై స్పందించిన ఆమె.. 46 జీవోను అమలు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ కి మరో సారి చెబుతున్నాం… నెల వారిగా ట్యూషన్ ఫీ మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేశారు.. దీనిపై ఈ రోజు అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.. ఇక, పరిస్థితిలు చక్కబడ్డాక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని.. ద్వితీయ సంవత్సరం ఫలితాలు క్రైటీరియా నచ్చక పోతే ఆ విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు విద్యాశాఖ మంత్రి.
కాగా, ఇవాళ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్టుగా ప్రకటించారు మంత్రి… ఉత్తీర్ణత సాధించినవారిలో 2,28,754 మంది బాలికలు, 2,22,831 బాలురు ఉన్నారు.. 1,76, 719 మంది ఏ గ్రేడ్, 1,04, 886 మంది బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 మంది డీ గ్రేడ్ సాధించారు.. మొదటి సంవత్సరం మార్కులనే ద్వితీయ సంవత్సరంకు వర్తింపజేశారు.. ప్రాక్టీకల్స్ మార్క్స్ మాత్రం అందరికి గరిష్టంగా కేటాయించారు. గతంలో ఫెయిల్ అయిన వారికి 35శాతం మార్కులతో పాస్ చేశారు.