దేశంలో సంస్కరణలు ప్రవేశపెట్టి అన్ని దేశాలతో సమానంగా అభివృద్ది చెందేందుకు కృషిచేసిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఏడాదిగా శతజయంతోత్సవాలను నిర్వహించిది. ఈరోజు పీవీ జయంతితో శత జయంతి ఉత్సవాలకు ముగింపుపలికారు. ఇందులో భాగంగా ఇప్పటికే నెక్లెస్ రోడ్‌ని పీవీ మార్గ్ మార్చింది ప్రభుత్వం. పీవీ మార్గ్ లో పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఈరోజు ఉదయం11 గంటలకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.