ఇప్పటి వరకు సహాయ మంత్రిగా పనిచేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో చోటు దక్కింది.. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌రెడ్డి.. కాగా, సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన కిషన్ రెడ్డిని.. కేంద్ర కేబినెట్లోకి తీసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. విధి నిర్వహణలో కీలకంగా వ్యవహరించి ఇద్దరి…
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజా ప్రతినిధుల కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది… 2015లో జరిగిన ఘర్షణ కేసులో తీర్పు వెలువరించిన కోర్టు.. దానం నాగేందర్‌కు వెయ్యి రూపాయాలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.. 2015లో జరిగిన ఘర్షణ కేసులో ఇవాళ హైదరాబాద్ జిల్లా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులోని ఎంపీ మరియు ఎమ్మెల్యేల స్పెషల్ సెషన్ కోర్టులో విచారణ జరిగింది.. యూ/ఎస్ 323,506 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ ప్రకారం బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ పూర్తి…
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. ఫస్ట్ రోజే ఆయన అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు.. గాంధీ భవన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతోన్న సమయంలో.. సీఎం రేవంత్ అని నినాదాలు చేశారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు.. ఆ నినాదాలపై సీరియస్ అయ్యారు రేవంత్.. ఎవరైనా ఇప్పటి నుండి సీఎం అంటే పార్టీలో ఉండరు.. పార్టీ నుండి బయటకు పంపుతాం.. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టం అని స్పష్టం చేశారు.. నన్ను అభిమానించే…
బంగారం చాలా విలువైన వస్తువు. బంగారం కొనడంలో మన దేశం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే.. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ.44,400కి చేరింది. read also : ఏపీలో భారీగా ఐపీఎస్ బదిలీలు 10 గ్రాముల…
జల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీంతో.. ఇవాళ 6 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా…
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన…
పారిశ్రామిక రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రుణాల వసూలుకు సంబంధించి బ్యాంకులు కొంత ఉదారంగా వ్యవహరించి అవి తిరిగి గాడిన పడే ప్రయత్నం చేయాలన్నారు.. ఎంఎస్ఎంఈ రంగానికి కేంద్రం…
కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా నడుస్తున్నాయి. కరోనా సమయంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్తడి ఆ తరువాత తగ్గుతూ వచ్చింది. ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధర రూ.44,310 వద్ద స్థిరంగా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,340 వద్ద నిలకడగా ఉన్నది.…
తెలంగాణలో కరోనా పాజిటివ్ రోజువారి కేసుల సంఖ్య ఎనిమిది వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,03,398 సాంపిల్స్ పరీక్షించగా.. 808 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 1,061 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,27,498కు చేరగా.. రికవరీ కేసులు 6,12,096గా…