కోవిడ్ థర్డ్ వేవ్ గురించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నందుకు ఇంజనీర్ పరుచూరి మల్లిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ జి. శ్రీనివాస్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇదివరకే నోటీసులు పంపించారు. పరుచూరి మల్లిక్ ఓ టీవీ టాక్ షోలో పాల్గొని, కరోనా థర్డ్ వేవ్‌లో ప్రతి ఒక్క ఇంటి నుంచి మరణం సంభవిస్తుందని వ్యాఖ్యలు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా, సుల్తాన్…
తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త శకం ప్రారంభం కానుంది.. మరో మూడు రోజుల్లో పార్టీని ప్రకటించనున్నారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు వైఎస్ షర్మిల… ఇప్పటికే పొలిటికల్ పార్టీ పెట్టడం ఖాయమని స్పష్టం చేసిన ఆమె.. దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.. షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా రిజిస్ట్రర్ చేయించారు.. ఇక, తాజాగా పార్టీ జెండా కూడా రెడీ అయిపోయింది.. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట…
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరుకుంది.. రాళ్లతో కొట్టడం, ఉరికించి కొట్టడం, చెప్పుల దండలు.. ఇలా ఇప్పుడు లోపల(జైలు)కి పోతావ్ అంటూ వార్నింగ్ ఇచ్చేవరకు వచ్చింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. టి.పీసీసీ చీఫ్ రేవంత్‌పై విరుచుకుపడ్డారు.. ఈ నెల 7వ తేదీ తర్వాత ఎవరు ఏం చేస్తారో తెలుస్తుందన్న…
తెలంగాణ సీఎంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య.. సీఎం కేసీఆర్ దోపిడీని బయటపెడతామని.. అయన శేషజీవితాన్ని జైల్లో గడపాల్సిందేనని వ్యాఖ్యానించారు.. ప్రజలు ఎదురు తిరిగే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించిన ఆయన.. శిశుపాలుడి పాపాల కంటే కేసీఆర్ పాపాలే ఎక్కువయ్యాయని కామెంట్ చేశారు.. తప్పుడు సమాచారం ఇచ్చే సన్నాసిని మాత్రం నేను కానని.. మీరే కాదు.. మీ ఇంజనీర్లు కూడా 50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినట్టు చూపించాలని…
హైదరాబాద్ ప్రజలకు మరో గుడ్ న్యూస్. 2017 లో మంత్రి కేటీఆర్ శంకు స్థాపన చేసిన.. బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. రూ. 385 కోట్లతో మూడున్నరేళ్ల వ్యవధిలో ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రెండు డివిజన్లు ఉండగా… ఒకటి ఫతేనగర్, మరొకటి బాలానగర్. ఇక ఈ రెండు డివిజన్లలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి. దీంతో నిత్యం కార్మికులు, లారీలు, ఆటో ట్రాలీలతో రద్దీగా…
ప్రస్తుతం మన దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడంతో పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరుగుతోన్న ఇంధన ధరలతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. read also : తెలంగాణలో తగ్గనున్న బీర్ల ధరలు ! తాజాగా లీటర్ పెట్రోల్ పై రూ. 35 పైసలు పెరగగా.. డీజిల్ ధర మాత్రం నిలకడగా ఉంది. పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో…
కరోనా తరువాత ఆర్ధిక రంగం క్రమంగా పుంజుకుంటోంది. సాధారణ పరిస్థితులు ఇప్పుడిప్పుడే నెలకొంటున్నాయి. కరోనా కారణంగా మూతపడిన అనేక రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. గతంలో పుత్తడిపై పెట్టుబడులు పెట్టిన ముదుపరులు, బంగారంలో పాటుగా ఇతర రంగాలపై కూడా దృష్టి సారిస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు పెరుగుతుండటంతో వాటి ధరలు పెరుగుతున్నాయి. అటు అంతర్జాతీయంగా కూడా పుత్తడిపై ముదుపరులు అధిక మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో దేశీయంగా వాటి ధరలు పెరుగుతున్నాయి. ఆరోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.…
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో కేసులు తగ్గుతున్నాయి. తాజాగా రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 6,26,690 కేసులు నమోదయ్యాయి. ఇందులో 6,11,035 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,964 కేసులు యాక్టీవ్‌గా…
రాజకీయాల్లో పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. గతంలో నాయకులు అధికారంలోకి వచ్చేముందు పాదయాత్రలు చేసిన సందర్బాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు నేతలు అధికారంలోకి వచ్చేముందు పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రల కారణంగా వారు అధికారంలోకి వచ్చారు. 2019లో జరిగిన ఎన్నికలు ముందు ఓ యువనేత పాదయాత్ర చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో పాలన చేతులు మారింది. కాగా, ఇలాంటి పాదయాత్ర ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతున్నది. Read: వివాహం మూర్ఖత్వం, విడాకులు జ్ఞానం.. ఆమిర్…
తెలుగు నేలపై పాదయాత్రలు కొత్త కాదు.. పాదయాత్రలు నిర్వహించి సీఎంలు అయినవారు ఉన్న నేల ఇది.. అయితే, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.. గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఆగస్టు 9వ తేదీ నుంచి మహాపాద యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారాయన.. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పాదయాత్ర నిర్వహిస్తాన్న ఆయన.. భాగ్యనగర్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుండి పాదయాత్రను ప్రారంభించి హుజురాబాద్ వరకు నడవనున్నట్టు…