మంత్రి ఎర్రబెల్లితో వెళ్లి సీఎం కేసీఆర్ను కలిశానని అన్నారు ఎల్ రమణ. సామాజిక తెలంగాణ కోసం కృషిచేయాలని కేసీఆర్కు చెప్పాన్నారు. తనతో కలిసి రావాలని సీఎం కేసీఆర్ కోరారన్నారు ఎల్ రమణ. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. తన నుంచి సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం కేసీఆర్కు తెలిపారని అన్నారు ఎల్ రమణ. కాగా, ఇప్పటికే ఎర్రబెల్లితోనూ సుదీర్ఘ మంతనాలు జరిపారు ఎల్. రమణ.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్రంలో టీడీపీకి మనుగడ కష్టమని…
ఉద్యోగాల పేరుతో ఆన్లైన్లో ఎరవేసి బాధితుల నుంచి అందినకాడికి దోచుకున్నారు కేటుగాళ్లు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫెస్బుక్ లో నకిలీ ఐడి క్రియేట్ చేసి టోకరా వేస్తున్నారు. తాజాగా విజయ్ రెడ్డి అనే నిరుద్యోగి.. ఐటీ ఉద్యోగం కోసం 8 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేశారు. అనంతరం ఆ కేటుగాడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఐపీ…
హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే 202 పిల్లర్ వద్ద నడుస్తున్న బీఎండబ్ల్యూ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో భయపడ్డ స్థానికులు దూరంగా పరుగెత్తారు. కారు ఇంజిన్ భాగంలో పొగలతో కూడిన మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ పక్కకు నిలిపివేశాడు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు త్వరగా దిగేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే వున్నా పెట్రోల్ బంక్ సిబ్బంది ఫైర్ సేఫ్టీ సహాయంతో మంటలను…
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలడం ఖాయం అయిపోయింది. గతంలోనే టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ.. టీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారంటూ జోరుగా ప్రచారం సాగినా.. ఆయన ఆ వార్తలను ఖండించారు.. అయితే, తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం.. రమణ.. కారు ఎక్కడమే మిగిలిందంటున్నారు.. ఆ వాదనలకు బలాన్ని చేకూరుస్తూ.. ఇవాళ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశం అయ్యారు ఎల్ రమణ.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి ప్రగతిభవన్కు వచ్చిన ఆయన.. కేసీఆర్తో చర్చలు జరిపారు.. ఇక,…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కాకరేపుతోన్న జల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేవారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… హైదరాబాద్లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో వివిధ అంశాలపై స్పందించిన ఆమె.. నదీ జలాల విషయంపై వ్యాఖ్యానిస్తూ.. కృష్ణా నది మీద రెండేళ్లుగా ప్రాజెక్టులు కడితే సీఎం కేసీఆర్ ఇప్పుడే కళ్ళు తెరిచారా? అంటూ ఫైర్ అయ్యారు.. ఇద్దరు సీఎంలు కౌగిలించుకోవచ్చు.. కలిసి భోజనాలు చేయొచ్చు.. స్వీట్లు తినినిపించుకోవచ్చు… కానీ, రెండు నిమిషాలు కూర్చొని మాట్లాడుకోలేరా?…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ విజయమ్మ… వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాక ముందు తెలంగాణలో రక్తం మరకలు ఉంటే… వైఎస్ వచ్చాక ఆ భూముల్లో నీళ్లు పారాయన్న ఆమె.. తుపాకుల చప్పుళ్లు తగ్గాయన్నారు.. మీ కుటుంబ సభ్యురాలుగా నా బిడ్డను చేర్చుచుకోండి అని కోరిన ఆమె.. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని.. తెలుగు రాష్ట్రాలు ఒక్కటే.. రాష్ట్రాల మధ్య అభిప్రాయ బేధాలు రావొచ్చు.. కానీ,…
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. తర్వాత ఆ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ దిగినా.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి.. ఇక, నిన్న గాంధీ భవన్ వేదికగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్.. ముఖ్యంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని టార్గెట్ చేశారు.. అయితే, మధు…
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ… సోనియాను ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఆయనే గతంలో సోనియాను బలి దేవత అన్నారని వ్యాఖ్యానించారు.. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. టీడీపీ పాత వాసనలు ఇంకా పోలేదని.. టీపీసీసీ కాదు తెలుగు దేశం కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కామెంట్ చేశారు.. నోట్ల…
కేసీఆర్పై ఆరోపణలు, విమర్శలు చేసి గెలవాలంటే అది సాధ్యం కాదని.. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అది సాధ్యమంటూ సలహా ఇచ్చారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్లో ఇవాళ సింగరేణి బీఎంఎస్ ప్రిసెడెంట్ మల్లయ్య.. టీఆర్ఎస్లో చేరారు.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా విపక్షాలపై సెటైర్లు వేశారు.. మార్కెట్ లోకి కొత్త బిచ్చగాళ్ల వచ్చారు… వాళ్లు ఎవరో మీకు తెలుసన్నారు.. నిన్న మొన్న పదవులు…
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 9 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.56 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.62 కు చేరింది. read also…