తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిసి.. ఈ మేరకు విజ్ఞప్త చేశారు.. అయితే, వారి వినతిపై సీఎం సానుకూలంగా…
మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్…
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా…
మీరంతా (ప్రజలు) నా వెంట ఉన్నంత కాలం నా లైన్ ఎవరు మార్చలేరు… ఎవరు ఏమి మాట్లాడినా నన్ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ భవన్లో టి.టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాత్ర ఏంటో అందరికీ తెలుసు అన్నారు.. తెలంగాణ వచ్చాక ఏమి జరిగిందో జనం కళ్ల ముందు ఉందన్న ఆయన.. తప్పు…
ఇప్పటికే తెలంగాణ టీడీపీకి రాజీనామా చేసిన ఎల్. రమణ ఇవాళ కారెక్కారు… తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రమణ.. ఈ మధ్యే సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.. కాసేపటి క్రితం తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా ఎల్. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్… రమణతో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ గూటికి చేరారు. కాగా, ఇటీవలే…
కరోనా మహమ్మారి కారణంగా చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా వేస్తూ వచ్చారు.. ఇక, కామన్ ఎంటెన్స్ టెస్ట్‌లను కూడా పలు దపాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. అన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. దీంతో.. వరుసగా కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు జరగబోతున్నాయి. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి… రేపటి నుంచి సెప్టెంబర్ రెండో…
దేశంలో రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఆందోళనలు చెందుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రేణులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నాచౌక్ నుంచి రాజ్‌భవన్…
కరోనా తరువాత మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో బంగారం కోనుగోలు చేసే వినియోగదారులు పెరిగారు. బంగారానికి డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ధరలు పెరగడం మొదలుపెట్టాయి. తాజాగా ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 45,150కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరిగి రూ. 49,260కి చేరింది. ఇక బంగారంతో…