దేశంలో బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. పుత్తడిని కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్ అని చెప్పాలి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.260 తగ్గి 44,990కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గి రూ.49,000కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1100 మేర తగ్గి రూ.73,200కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ దేశీయంగా ధరలు తగ్గడం విశేషం. భారీగా బంగారం ధరలు తగ్గడంతో వినియోగదారులు పెద్దమొత్తంలో బంగారం కోనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read: విజయ్ సెట్లో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టలేదట !