తెలంగాణలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 746 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… మరో ఐదుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 729 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,37,373కు చేరుకోగా.. ఇప్పటి వరకు 6,23,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. మృతుల సంఖ్య 3,764కు పెరిగింది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 97.29 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 97.86 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,165 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 71 కేసులు, ఖమ్మంలో 61, కరీంనగర్‌లో 57, పెద్దపల్లిలో 51 కేసులు వెలుగు చూశాయి.