జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వారి వేతనాలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుతం వారి వేతనం నెలకు రూ.15 వేలు ఉండగా.. దానిని రూ.28,719కి పెంచింది నిర్ణయం తీసుకుంది.. ఈ నెల నుంచే పెరిగిన వేతనాలను జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు చెల్లించనుంది సర్కార్.. ఇక, ప్రొబేషన్ పీరియడ్ మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది సర్కార్.. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి ఎం రఘునందర్ రావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, ప్రభుత్వ నిర్ణయంపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.