టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల్ని చీట్ చేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు.. మహిళా సాధికారతకి కాంగ్రెస్ పెద్ద పీటవేసిందని.. కానీ, టీఆర్ఎస్ మహిళల్ని చీట్ చేస్తోంది.. ఒక్కో మహిళకు ఐదు నుండి 10 వేలు బాకీ ఉన్నారన్నారు. కాంగ్రెస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని గుర్తుచేసిన ఉత్తమ్.. కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక… వడ్డీ…
గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.. వర్ష బీభత్సవానికి హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది… ఈ నేపథ్యంలో.. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.. రాగల 4 రోజులపాటు భారీ నుంచి అతి భారీవర్షాలు పడతాయని పేర్కొంది.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ…
ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అందుకే దానికి మన దగ్గర ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కానీ ఈ కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు… తాజాగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర…
అది పేరుకేమో మహానగరం.. తెలంగాణ కీర్తి కీరిటానికి బ్రాండ్ అంబాసిడర్.. అన్ని మతాలు, కులాలకు కేరాఫ్.. మినీ భారతదేశంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక్క చిన్నవానకే అతలాకుతలం అవడం ఏమిటీ? అన్న ప్రశ్న ప్రతీఒక్కరి మనస్సులో మొదలుతోంది. వేల కోట్ల రూపాయాలతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని డబ్బాలు కొట్టుకునే పాలకులు ప్రస్తుత దుస్థితికి ఎవరు బాధ్యత తీసుకుంటారనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. గత పాలకుల తప్పిదమని ఒకరంటే ఇప్పుడున్న పాలకులదే తప్పని మరొకరు.. ఇలా విమర్శలు చేసుకుంటూ తప్పించుకుంటున్నారు.…
గత మూడు రోజులుగా భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షాలకు రోడ్లు నీటమునిగాయి. ఇక్కడికక్కడ ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఇక గండిపేటకు భారీగా వరద నీరు చేరుకోవడంతో నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. గండిపేటకు పర్యాటకులను అనుమతించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మూసీ పరివాహ ప్రాంతంలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అంబర్పేట్- మూసారాంబాగ్ వంతెన…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన..…
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ దగ్గర జరిగిన దిశ ఎన్కౌంటర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది… అయితే, దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టింది కమిషన్.. ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరగనుంది.. అందులో భాగంగా ఎన్కౌంటర్లో చనిపోయినవారి కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించనున్నారు అధికారులు.. ఇక, ఈ నేపథ్యంలో ఎన్టీవీతో మాట్లాడిన ఎన్కౌంటర్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు.. తమకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. కమిషన్ విచారణ కోసం రోజు వస్తున్నాం.. లోపల ఏది…
తెలంగాణలో దిశ కేసు ఎంత సంచనలం రేపిందో అందరికి తెలుసు. ఆ కేసులు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఆ ఎన్ కౌంటర్ పై దిశ కమీషన్ విచారణ వేగవంతం వేగవంతం చేసింది. నేడు దిశ కమిషన్ ముందు మరోసారి ఎన్ కౌంటర్ బాధిత కుటుంబాలు హాజరు కానున్నారు. ఎన్ కౌంటర్ కు గురైన కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ నమోదు చేసుకుంటున్న కమిషన్… ఇప్పటికే పలువురు సాక్ష్యులను విచారించింది. సిట్…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్…