హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెత్త స్వీకరణ కేంద్రం లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసి పడుతుండడంతో… స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే… స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది… మంటలను అదుపు చేసింది. ఈ ఘటన లో రెండు చెత్త రీసైక్లింగ్ మిషన్లు మంటలకు కాలి బూడిదయ్యాయి. అగ్నికి అహుతైన మిషన్ల విలువ ఏకంగా రూ. 12 లక్షలు ఉంటుందని గుర్తించారు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలార్ దేవిపల్లి పోలీసులు.