మన దేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడైనా బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మన ఇండియాలో జరిగే పెళ్లిళ్ల సీజన్లో పసిడికే డిమాండ్ ఎక్కువ. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 43,990 కి…
సందర్శకులతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ వాతావరణం సందడిగా మారింది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షల అమలుతో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు నగరవాసులు.. నో ట్రాఫిక్ జోన్ అమల్లోకి రావడంతో హుస్సేన్ సాగర్ కొత్తగా కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు వున్నాయి. రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో ఫ్యామిలీ & పిల్లలతో ట్యాంక్ బండ్ కళకళలాడుతోంది. ట్యాంక్ బండ్ మీద…
హైదరాబాద్‌లో వినాయక చవితి సందర్బంగా ఏర్పాటు చేసిన వందలాది గణపతి మండపాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమర్జనానికి అనుమతిని నిరాకరిస్తూ ఈ నోటీలుసు ఇచ్చిరు. హైకోర్టు ఆదేశాలతోనే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్‌లో నిమర్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలపై రేపు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ను…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీలైనంత త్వరగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా గజ్వేల్‌లో సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డుమ్మాకొట్టారు. పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి జగ్గారెడ్డి హాజరుకాకపోవడంపై ఇప్పుడు పలువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక…
హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు తీర్పుపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్పందించింది.. మీడియాతో మాట్లాడిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ భగవంత్ రావు… దేవుణ్ణి పూజించడం… నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు.. హై కోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి.. వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్ అవుతుంది అనేది ఏ…
మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం.. ఆస్పత్రికి తరలించడం కూడా వెనువెంటనే జరిగిపోయాయి.. ఆయనకు సరైన సమయంలో ట్రీట్మెంట్ అందడం వల్లే ప్రాణాపాయం తప్పింది అంటున్నారు తేజ్‌కు మొదట ట్రీట్మెంట్ చేసిన మెడికవర్ వైద్యుల బృందం… ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మెడికవర్ వైద్యులు.. గోల్డెన్ హవర్లో ట్రోమా కేర్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్ అని.. ఈ టైంలో ఇచ్చే ట్రీట్మెంటే సాయి ధరమ్ తేజ్‌ని కాపాడుతోందన్నారు.. ప్రమాదం జరిగిన గంటలోపు వైద్యం…
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజును ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సింగరేణి కాలనీలో అదృశ్యమైన ఆరేళ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతిచెందడంతో కలకలం రేగింది.. అయితే, బాలిక పక్కింట్లో నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లోనే మృతదేహమై కనిపించింది చిన్నారి.. దీంతో.. బాలిక తల్లిదండ్రులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు.. నిందితుడు పరారీ కాగా.. వెంటనే…
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు బైక్‌లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్‌లపై హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్‌లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…