తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… గత కొంత కాలంగా.. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఛాలెంజ్‌లు కొనసాగుతుండగా.. తాజాగా, కేటీఆర్‌కు రేవంత్.. వైట్ ఛాలెంజ్ విసరడం.. ఇక, రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ పరువునష్టం దావా వేయడం లాంటి పరిణామాలతో పొలిటికల్ హీట్ పెరిగింది.. ఇక, ఇవాళ హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు టీఆర్ఎస్ కార్యకర్తలు.. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.. కాంగ్రెస్ – టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాటతో బాహాబాహీకి దిగారు.. దీంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, రేవంత్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.. దీంతో.. మరోసారి టెన్షన్ టెన్షన్‌గా మారింది.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తే.. కేసీఆర్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.. ఒకానొక దశలో రాళ్లు విసురుకోవడం.. కర్రలతో దాడి వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టే పనిలోపడిపోయారు.