పర్యావరణ అభిమానులు వినూత్న రీతిలో గణనాధున్ని నిమజ్జనం చేశారు. ఎల్.బి నగర్, చింతల కుంట ఆల్ ఇండియా రేడియో కాలనీ వాసులు చేసిన నిమజ్జనం ఆలోచింపచేసేలా ఉంది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న మట్టి వినాయకుడు ఈరోజు మధ్యాహ్నం వినూత్న రీతిలో గంగమ్మ వడిలో చేరాడు. కాలనీలోనీ కమిటీ హాల్ ప్రాంగణంలో గుంత , తవ్వి అందులో నీటి పైపులు పెట్టి నిమజ్జనం చేశారు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేడియో పర్యావరణ హితమైన గణపతిని నెలకొల్పి , పర్యావరణ హితమైన నిమజ్జన కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని కాలనీ ప్రెసిడెంట్ కటకం వెంకటేష్ మరియు కాలనీవాసులు తెలిపారు.