మన దేశంలో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా రూ. 44,200 కి చేరింది. కానీ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.…
తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి… లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు సాయంత్రం అయ్యిందంటే చాలు దంచికొడుతున్న వానలతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అయితే, మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.. ఇవాళ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. రేపు…
వీసీ సజ్జనార్. అది పేరు కాదు. బ్రాండ్. మహిళలను వేధించే వారి ప్రాణం తీసే బ్యాండ్. పోలీస్ పవర్ కు ఆ పేరు కేరాఫ్. నేషనల్ లెవల్లో కాదు.. ఇంటర్నేషనల్ లెవల్లో రాష్ట్ర పోలీసుల ప్రతాపాన్ని మార్మోగించిన వ్యక్తి ఆయన. ఇంతటి పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్.. కీలక ఆపరేషన్లను సమర్థంగా నిర్వహించిన పేరున్న అధికారి.. ఇప్పుడు టీఎస్ఆర్టీసీకి బాస్ అయ్యారు. ఎండీగా ఇవాళే బాధ్యతలు తీసుకున్నారు. పోలీస్ అధికారిగా దూకుడుగా పని చేసిన ఆయన.. ఇప్పుడు…
రాత్రి ఎనిమిదికి మొదలైంది. వర్షం టెర్రర్…పదకొండు వరకు కంటిన్యూగా దంచుతూనే ఉంది…ఫలితంగా నగరం అతలాకుతలం…మూడుగంటల్లో మొత్తం అస్తవ్యస్తం….ఇదీ రాత్రి హైదరాబాద్‌లో రాత్రి జలప్రళయం… రాత్రి కురిసిన వానను చూసిన వారికి.. ఆకాశానికి చిల్లుపడిందా అనిపిచింది.. రోడ్లు కాల్వలయ్యాయి.. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్.. ఇలా ప్రధాన కూడళ్లు చెరువు లయ్యాయి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్. లోతట్లు ప్రాంతాల్లోని ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరింది. కృష్ణానగర్ ఎ-బ్లాక్ వద్ద వరద ఉధృతికి ఓ వ్యక్తి కొట్టుకుపోగా..…
హైదరాబాద్‌లో భారీ వర్షం దంచి కొట్టింది. మూడు గంటల పాటు కురిసిన వానకు… జంటనగరాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాల్లో… మోకాళ్ల లోతు నీరు చేరింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.. పాతబస్తీ బహదూర్‌పురా వద్ద రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మాదాపుర్ శిల్పారామం సమీపంలో ప్రధాన రహదారిపై భారీగా చేరిన వరద నీరడంతో పాటు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.…
బంగారం కొనాలని చూసేవారికి కాస్త ఊరట లభించింది.. పసిడి ధరలు మరోసారి తగ్గాయి.. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి.. రూ.48,230కు దిగిరాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.44,200కు పడిపోయింది.. ఇక, వెండి కూడా బంగారం బాటనే పట్టింది.. రూ.300 తగ్గడంతో కిలో వెండి ధర రూ.68,400కు దిగివచ్చింది. ఇక్కడ ఇలా ఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మాత్రం పైకి…
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్‌ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss…
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్ఆర్తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇక, వైఎస్ఆర్ సన్నిహితుడి, ఆత్మగా పేరున్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు కూడా ఆహ్వానం వెళ్లింది.. గాంధీ భవన్లో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనానికి నాకు ఆహ్వానం అందింది.. నేను…