కరోనా కారణంగా చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం కొన్ని సర్వీసులను నడుపుతున్నారు. కరోనా కేసులు దాదాపుగా తగ్గిపోవడంతో తిరిగి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు నుంచి నగరంలో 100 శాతం బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. 1285 ఆర్టీసీ, 265 అద్దె బస్సులు కలిపి మొత్తం 1551 బస్సులు ఈరోజు నుంచి నగరంలో రోడ్డుమీదకు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు కొంతమేర ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవచ్చు. మామూలు సమయంలో అర్థరాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. కానీ, కరోనా కారణంగా రాత్రి 10 గంటల తరువాత కొన్ని ప్రాంతాల్లో బస్సుల అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
Read: ఓడిపోయిన ముఖ్యమంత్రిని ఓడించడమే లక్ష్యంగా…