హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం నుంచే వర్షం ప్రారంభమైంది.. ఇప్పటికే.. సైదాబాద్, సంతోష్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కోఠి.. తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.. ఇక, సాయంత్నాకి మరికొన్ని ప్రాంతాలకు విస్తరించి.. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడీగూడ, ఇందిరా పార్క్, దోమలగూడ, విద్యానగర్, అడిక్‌మెట్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. కూకట్‌పల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో భారీగా వాన కురుస్తోంది… అయితే, సిటీలోని చాలా ప్రాంతాల్లో రానున్న గంటపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. అంతేకాదు.. నగరవాసులు ఇళ్లలోనే ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని హెచ్చరించింది వాతావరణ కేంద్రం..