హైదరాబాద్ నగరంలో ఈరోజు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసరాల వైపుకు గణపయ్యలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో నిమజ్జన కార్యక్రమాలు ఆలస్యం అయ్యాయి. దీంతో ఈరోజు కూడా నిమజ్జనం జరుగుతున్నది. నిమజ్జనం పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇక ఉదయం నుంచి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలన్నీ గణపయ్య వాహనాలతో నిండిపోయాయి. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. వర్షంలోనే శోభాయాత్ర సాగింది. ఖైరతాబాద్ గణపయ్య త్వరగా జరగడంతో మిగతా విగ్రహాలను వేగంగా నిమజ్జనం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తికానున్నది.
Read: సిద్ధూని వెనకేసుకొచ్చిన కాంగ్రెస్…ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు…