పండుగ సమయం ఆర్టీసీ గుడ్‌న్యూస్.. వాత కూడా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగలు వచ్చాయంటే చాలు.. పట్టణాల్లో స్థిరపడినవారు సైతం.. తాను పుట్టిన ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు.. దీంతో, రద్దీ పెరిగిపోతోంది.. అయితే, రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. ప్రత్యేకంగా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.. ఈ బస్సులు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఇక, పండుగన సీజన్‌లో ప్రత్యేక బస్సులను నడపడమే కాదు.. ఈ స్పెషల్ బస్ సర్వీసుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు కూడా వసూలు చేయనున్నారు. అయితే, ఈ సమయంలో.. రెగ్యులర్ బస్సు సర్వీసుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని.. కానీ, దసరా స్పెషల్ బస్సుల్లోనే 50 శాతం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.. త్వరలో అన్ని బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ అమలు చేస్తామని.. ప్రైవేట్ బస్సులకు ధీటుగా ఆర్టీసీ బస్సులను నడుపుతామన్నారు ద్వారకా తిరుమలరావు.
మరోవైపు.. వరుసగా పెరిగిపోయిన డీజిల్ ధరలు కూడా ఆర్టీసీపై భారం మోపుతున్నాయని తెలిపారు ద్వారకా తిరుమలరావు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైనా ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందన్న ఆయన.. విలీనం తర్వాత కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. నిర్వహణ వ్యయం తగ్గించేందుకు త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని.. సంస్థపై పడుతోన్న భారం, నష్టాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. కానీ, ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు.
Also Read
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!