హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది… కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తని కడతేర్చిన ఓ ఇల్లాలు.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.. పూర్తి వివరాల్లోకి వెల్తే.. గత కొంతకాలంగా స్థానికంగా మురళీధర్ రెడ్డి, మౌనిక అనే దంపతులు నివాసం ఉంటున్నారు.. వీరికి 11 ఏళ్ల క్రితమే వివాహం జరిగింది.. వారికి సంతానంగా 9 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు.. అయితే, గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో తరచు గొడవలు జరిగేవని తెలుస్తోంది.. దీంతో ఈ నెల 6వ తేదీన రాత్రి భర్తను దారుణంగా పొడిచి చంపినట్టుగా తెలుస్తోంది.. భర్తను హత్య చేసేందుకు కిచెన్ లో వాడే కత్తితో వాడిన ఆమె.. భర్తని పొడిచి చంపేసింది.. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది… ఇక, కేసు నమోదు చేసుకున్న సరూర్ నగర్ పోలీసులు, ఆ మహిళను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.