ఒక్క పైసా కేంద్రానిదైనా.. ఒకటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం పథకాలకు ఖర్చు చేసే ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తుందంటూ పలు సందర్భాల్లో బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు.. ఒక, గొల్ల కురుమల కోసం ప్రభుత్వం అందిస్తున్న గొర్రెల పంపిణీ పథకంలోనూ కేంద్రం నిధులున్నాయని విమర్శించింది బీజేపీ.. అయితే, గొర్రెల పంపిణీ పథకంలో ఒక్క పైసా కేంద్రం వాటా ఉన్నా సీఎం పదవీకి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు.. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. గొర్రెల పంపిణీ ఈ పథకం కోసం అప్పు తీసుకుని వడ్డీ కడుతున్నామని వెల్లడించారు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఈ పథకం లేదు? అంటూ నిలదీశారు.. నీవు ఇచ్చింది ఏం తోక.. అబద్దాలు మాట్లాడటం సరికాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, పెన్షన్లు ఇస్తున్నారా? పెట్రోల్, డీజిల్ ధరలపై మాట్లాడితే పక్క దేశాలకు పోవాలని అంటున్నారు. అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు మండిపడ్డారు సీఎం కేసీఆర్… తెలంగాణ బిల్లు పాసైనప్పుడు కేసీఆర్ ఓటేయలేదు అని బండి సంజయ్ అంటున్నాడు. ఆయన మాటలు వింటుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.. తెలంగాణ ఉద్యమంలో నువ్వెక్కడ. నువ్వు ఎవ్వనికి తెలుసు ఈ రాష్ట్రంలో అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఇప్పుడొచ్చి దుంకుతా అంటే నడవదు.. కథ తేల్చే దాకా నేనే మాట్లాడుతా.. వదిలిపెట్టను.. ప్రతి రోజు మాట్లాడుతా.. గారడీ చేస్తామంటే నడవనివ్వను అంటూ హెచ్చరించారు. మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వం కూల్చి దొడ్డి దారిన ప్రభుత్వం నడుపుతున్నారని ఆరోపించారు కేసీఆర్.. ప్రభుత్వాలను కూల్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారన్న ఆయన.. తెలంగాణలో 107 సీట్లలో బీజేపీ డిపాజిట్ పోయిందని గుర్తుచేవారు.. నాగార్జున సాగర్ లో కూడా బీజేపీ డిపాజిట్ పోయిందన్న ఆయన.. ప్రజల పక్షాన మాట్లాడితే దేశద్రోహం అంటారు… తెల్లారితే ఐటీ దాడులు చేస్తారు అంటూ ఫైర్ అయ్యారు.. పిట్ట బెదిరింపులకు బెడిరిపోం.. బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడలని వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!