డ్రగ్స్ రవాణాకు ట్రాన్సిట్ హబ్ గా మారింది హైదరాబాద్. ఇక్కడ నుంచి నుంచి వందల కిలోల డ్రగ్స్ ఆస్ట్రేలియాకు రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ ను టార్గెట్ చేసుకుంది డ్రగ్స్ మాఫియా. ఏడాది కాలంలోనే 315 కిలోల పై చిలుకు డ్రగ్స్ ను పంపింది మాఫియా. డ్రగ్స్ కు హైదరాబాద్లో ట్రాన్సిట్ పాయింట్ గా ఎంచుకుంది మాఫియా. హైదరాబాదులో ఉన్న ఇంటర్నేషన్ పార్సిల్ కొరియర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తుంది. అయితే వివిధ రూపాల్లో డ్రగ్స్ ని ఆస్ట్రేలియా పంపుతున్న మాఫియా… స్కానర్లు దొరకకుండా వివిధ రూపాల్లో డ్రగ్స్ సరఫరా చేస్తుంది. Dri, ncb తో సిటీ పోలీస్ సోదాల్లో డ్రగ్స్ పట్టుకున్నారు. చెన్నై కి చెందిన కొంతమంది వ్యక్తులు డ్రగ్స్ ను ఆస్ట్రేలియా పంపుతున్నట్లు గా గుర్తించారు. డ్రగ్స్ తయారీ ,రవాణా చేస్తున్న వారిని గుర్తించి పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.